మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో విశాఖ మాస్టర్స్ క్రీడాకారులు క్రీడాకారిణిలు పతకాల పంట.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : మార్చ్ 04:
ఇటీవల పుణెలో ఛత్రపతి శివాజీ స్టేడియంలో ఫిబ్రవరి 13 నుండి 17 వరకు జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో విశాఖ మాస్టర్స్ క్రీడాకారులు క్రీడాకారిణిలు పతకాల పంట పండించారు. అంతర్ జాతీయ వెటరన్ క్రీడాకారులు అయిన కె లతాదాస్ 200 మి హర్డిల్స్ , స్టిపుల్ చెజ్ మరియు 4*400 రిలేలో ఒక రజత, రెండు కాంస్య పతకాలు సాధించారు. డా వైజయంతిమాల 5కి మి నడక లో800 మి పరుగు స్టీపుల్ చేజ్ , 4*400 రిలే లలో రెండు బంగారు, ఒక రజతం, ఒక కాంస్య పదకం సాధించారు. లావణ్య 200 మి హర్డిల్స్ లో కాంస్య పతకం సాధించారు. పురుషుల విభాగంలో ఆర్టీసీ ఉద్యోగి అయిన రాంబాబు 400మి పరుగు మరియు 4*400 లలో రజతం మరియు కాంస్య పతకం సాధించి మన రాష్ట్రానికి జిల్లాకి గర్వకారణంగా నిలిచారు . ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సన్మాన సభకు అధ్యక్షత వహించిన పసుపులేటి ఉషాకిరణ్ (ఉత్తర నియోజక వర్గం జనసేన కన్వీనర్) పాల్గొని విజేతలను సన్మానించి మేమొంటోలను అందజేశారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ విజేతలు మరిన్ని జాతీయ అంతర్ జాతీయ పోటీలలో పాల్గొని పతకాలు సాధించి రాష్ట్రానికి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ అభినందన సభలో పాల్గొన్న జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు ఎస్ రాంప్రసాద్ , జిల్లా కార్యదర్శి బి రమేష్ కుమార్ , కార్యనిర్వహక కార్యదర్శి బి రాంకుమార్, కోశాధికారి శ్రీమతి లతాధాస్ ముఖ్య పెట్రాన్ మరియు సి ఇ ఓ సుమేద గ్రూప్ వి ఎన్ సుందర్ ఈ సందర్భంగా విజేతలను అభినందించారు