శంఖారావం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మరింత లబ్ది

శంఖారావం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మరింత లబ్ది : టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు  

మధురవాడ : వి న్యూస్  ప్రతినిధి : మార్చ్ 05:

ఐదో వార్డు పోలింగ్ బూత్ కన్వీనర్ల సమావేశంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు .

భీమిలీ నియోజకవర్గం మధురవాడ ఐదవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వార్డ్ టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ మొల్లి లక్ష్మణరావు,వార్డ్ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ పోలింగ్ బూత్ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వార్డు అధ్యక్షులు నాగోతి వెంకటసత్యనారాయణ,భీమిలీ నియోజక వర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను తదితరులు మాట్లాడుతూ పోలింగ్ బూత్ ఇన్చార్జిలందరూ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన శంఖారావం సూపర్ సిక్స్ పథకాలను రోజూ ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలు మరియు క్యాలెండర్లు ప్రజలకు అందించి పథకాల గురించి ప్రజలకు వివరించాలని,ముఖ్యంగా మహిళలకు ఈ సూపర్ సిక్స్ ద్వారా మరింత లబ్ధి చేకూరుతుందని, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరినీ ఏ విధంగా ఆదుకుంటుందో తెలియపరచి ప్రతీ ఒక్క ఓటర్ ని కలిసి వారికి పథకాలు అర్థమయ్యేల వివరించాలని దిశ నిర్దేశం చేశారు. అనంతరం బూత్ ఇన్చార్జ్ లు అందరికీ పార్టీ శంఖారావం సూపర్ సిక్స్ పథకాల మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఐదవ వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు పోలింగ్ బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.