విశాఖ రైల్వే గ్రౌండ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కాంగ్రెస్ బహిరంగ సభకు తరలి రండి : భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు గరే వెంకట రమణ.
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : మార్చ్ 05:
కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మిత్రులు ,అందరికీ వందనాలు మిత్రులారా మార్చ్ 11వ తేదీ సాయంత్రం విశాఖ రైల్వే గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు, సభలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటే కరణ చెయ్యకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మానిఫెస్టోలో పొందు పరుస్తున్నట్లు రేవంతి రెడ్డి, షర్మిల రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ నివ్వనున్నారు. ఈ సభలో అతి రధ మహారదులు ఏ ఏ సి సి జనరల్ సెక్రటరీ మాణికం ఠాగూర్, ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు, మాజీ పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ రాజ్య సభ్యులు, కే వి పి రామచంద్ర రావు, ఏపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పి రాకేష్ రెడ్డి, విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గొంప గోవింద రాజు, పాల్గొని ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కొరకు విశాఖ ప్రజలను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని వినిపిస్తారు, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరిస్తారు. కావున భీమిలి నియోజకవర్గం ప్రజలు సభకు మీరంతా తరలిరావాలని భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, పారిశ్రామిక వేత్త గరే వెంకట రమణ కోరుతున్నారు.