బీసీ డిక్లరేషన్ పైన సమావేశం
తెర్లం వి న్యూస్ప్రతినిధి : మార్చ్ 02:
మండలంలో అరసబలగ సర్పంచ్ కొరగంజి సాయిరాం బీసీ డిక్లరేషన్ పైన పత్రికా సమావేశం నిర్వహించారు. 05-03-2024 న అమరావతిలో జరిగే బీసీ డిక్లరేషన్ సభను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగదేశం జనసేన ల ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీ ల ఆత్మ గౌరవం నిలబెట్టిన ఏకైక పార్టీ తెలుగదేశం అని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీ లు మరియు ఎస్సీల పైన దాడులు పెరిగిపోయాయి అని మండిపడ్డారు. కావున బీసీ లు అందరూ ఏకతాటిపై వచ్చి తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు. బీసీ డిక్లరేషన్ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత న జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, మాజీ మంత్రి అచ్చెంనాయుడు, మాజీ మంత్రి కోల్లు రవింద్ర, బొబ్బిలి నియోజవర్గ టీడీపీ ఇంఛార్జి బేబీ నాయనా, స్టేట్ బీసీ సాధికార సమితి కన్వీనర్ తిరుమలేశు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు కావున రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను వియవంతం చెయ్యాలని కోరారు.