ఫోటో గ్రాఫర్ పోతిన సాయి కి శాంతి చేకూరాలని కొవ్వొత్తుల వెలుగు ప్రదర్శన

ఫోటో గ్రాఫర్ పోతిన సాయి కి శాంతి చేకూరాలని కొవ్వొత్తుల వెలుగు ప్రదర్శన.

ఫోటో గ్రాఫర్ సాయి కుటుంబానికి న్యాయం జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలి: విశాఖ ఫోటో గ్రాఫర్ ల సంఘం అధ్యక్షులు మధు,

*ఫోటో గ్రాఫర్ పోతిన సాయి కుటుంబానికి విశాఖ ఫోటోగ్రాఫర్ లు అండగా ఉంటాం : నాగోతి నరసింహ నాయుడు* .


*మధురవాడ : వి న్యూస్  ప్రతినిధి : మార్చ్ 04:* 

రావులపాలెంలో హత్యకు గురైన మధురవాడికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఆత్మకు శాంతి చేకూరాలని వైజాగ్ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్, మధురవాడ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత క్యాండిల్ వెలుగు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200మందికి పైగా ఫోటో మరియు వీడియో గ్రాఫర్లు పాల్గొని సాయి కుటుంభ సభ్యులకు న్యాయం జరగాలని నినాదాలు చేసారు,

మహ విశాఖ 6వ వార్డు పరిధి శిల్పారామం జాతర వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని రానున్న రోజుల్లో ఎవరికీ ఎటువంటి హానీ జరగకుండా ఫోటోగ్రాఫర్లు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా హత్యకు గురైన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చెయ్యాలని అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మధురవాడ అధ్యక్షుడు నాగోతి నరసింహ నాయుడు మాట్లాడుతూ కెమెరాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడం సమంజసం కాదని గతంలో కూడా విలువైన వస్తువుల కోసం ఫోటోగ్రాఫర్ల పై అనేక చోట్ల భౌతిక దాడులు జరిగేవని, కానీ ఇప్పుడు హత్యలు చేసే స్థాయికి చేరుకుందని కాబట్టి అవుట్డోర్ ఈవెంట్లోకి వెళ్లే ప్రతి ఫోటోగ్రాఫర్ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు, అనంతరం స్థానిక ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లతో కలిసి బక్కనపాలెంలో గల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.