చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కలు.
పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత:
ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్:
మధురవాడ: వి న్యూస్ : మార్చ్ 03:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా ఐదో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత వార్డులో గల యూ పీ హెచ్ సి మరియు అంగనవాడి కేంద్రాల్లో జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమం కు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు క్రమం తప్పకుండా వేయించాలని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయం లో చాలా బాధ్యతగ ఉండాలని, చిన్నారులకు వేయించాల్సిన పోలియో చుక్కలు మరియు టీకాలు సరైన సమయంలో వేయించాలని అలా వేయించడం వలన పిల్లలు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. మార్చ్ 3 తారీకున పొరపాటున కానీ వివిధ కారణాల చేతన కానీ పోలియో చుక్కలు వేయించ లేకపోతే మార్చ్ 5 న కూడా అంగన్వాడి కేంద్రాల్లో మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కలు వేయించివచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది మరియు అంగన్వాడి టీచర్లు, సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.