ఏలక్ట్రోల్ బాండ్ల వివరాలు ఎస్ బీ ఐ భహిర్గతం చేయాలి.సి పీ ఎం..
మధురవాడ :వి న్యూస్ ప్రతినిధి : మార్చ్ 11
అవినీతిని చట్ట బద్దం చేయడమే నరేంద్ర మోడీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం విధానం అని, అది కార్పొరేట్ వ్యాపారుల నుండి ఎలక్ట్రొల్ బాండ్ల రూపంలో బైట పడిందని సిపిఎం మధురవాడ జోన్ కార్యదర్శి డి అప్పలరాజు అన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు దీనికి నిదర్శనం అని అన్నారు.ఎలక్ట్రొల్ బాండ్ల వివరాలు బైట పెట్టాలని,ప్రజలకు అందుబాటులో వివరాలు ఉంచాలని ఆదేశించిన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించకుండా గడువులు కోరడం వెనుక బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి ఉందాని, ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.ఎలక్ట్రోల్ బాండ్ల వివరాలు ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ ఎస్ బీ ఐ మధురవాడ బ్రాంచ్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్ల కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జోన్ కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని చేపట్టిన తరువాత మన దేశంలో కార్పోరెట్ వ్యాపారులు లక్షల కోట్ల కు ఎగబాకడమే కాకుండా,ప్రపంచ కుబేరులతో పోటపడుతున్నారని అన్నారు.
ఇదంతా సామాన్య,పేద ప్రజలను మోసం చేసి దోచుకున్న సొమ్ము అని తెలియ జేశారు. నీతి మంతులం అని తమకు తామే జెబ్బలు చరుచుకున్న బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు బైట పడ్డాయి అని తెలియ జేశారు.ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా బీజేపీ వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ల ద్వారా తీసుకుందని ఇది అక్రమ సంపాదనని తెలియజేశారు. సిపిఎం దీనిని మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తుందని తెలియజేశారు. బిజెపి అవినీతి బాండ్ల వివరాలు బయటపడకుండా ఉండేందుకు ఎస్ బి ఐ ని అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతుందని తెలియ అన్నారు.ఈ వ్యవహారాన్ని బ్యాంకు మీదికి నెట్టాలని బిజెపి, నరేంద్ర మోడీ చూస్తున్నారు అని అన్నారు. వివరాలు వెంటనే బయటపెట్టి ఎస్ బి ఐ చిత్త శుద్దినీ నిరూపించుకోవాలని కోరారు.తద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవాన్ని కాపాడు కోవాలనీ హితవు పలికారు.ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు సియ్యాద్రి పైడితల్లి, ఆశి గురుమూర్తి రెడ్డి, దొడ్డి తులసి, కె నాగరాజు, ఉప్పాడ రాజు, కె కొండమ్మ, కె పుష్ప, ఏ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.