చంద్రబాబు నాయుడు,లోకేష్ ఆనందబాబు గొల్లంగి స్టేట్ బీసీ కో-ఆర్డినేటర్ చేయు బహిరంగ విన్నపం!
మధురవాడ :వి న్యూస్ : మార్చ్ 11:
భీమిలి ఇంచార్జి కోరాడ రాజబాబు నే టీడీపీ ఏమ్మెల్యే అబ్యర్ధిగా ప్రకటించాలని, భీమిలి ప్రజలు మరియు టీడీపీ కేడర్ ఎందుకు కోరుకుంటుందో మీకు తెలియాలి అని దీనిపై పునరాలోచన చేసి కోరాడ రాజబాబుని భీమిలి అభ్యర్థి గా ప్రకటించాలని కోరుతూ స్థానికుడు లోకల్ వ్యక్తి మరియు అన్ని రాజకీయ పార్టీలలోనూ రాజబాబుకి అభిమానులు మెండుగా వున్నారు, వారు రాజబాబుకే వోట్ వేస్తారు, టీడీపీ ఓట్ల పెర్సెంటేజ్ పెరిగింది ప్రజలు కష్టాల్లో ఉన్నట్టు తెలిస్తే చాలు, అతను ఏ పార్టీవాడైన వెళ్లి కలసి అతని కష్టం ఏ విధంగానైనా తీరుస్తాడు టీడీపీ నాయకులను టీడీపీ మహానాడులకు ప్రత్యేక సమావేశాలకు బస్సులు ఏర్పాటు చేసి అదే బస్సులో వారితో ప్రయాణించి, వారికీ కావలిసిన మర్యాదలు చేయడంలో ఇంచార్జిలందరికి ఆదర్శపాత్రుడు తమరు జైల్లో వున్నప్పుడు టీడీపీ కేడర్ యావత్తుని మండలాల వారీగా ఉదయం నుండి సాయింత్రం వరకు, వారితో కలసి అన్ని రోజులు నిరాహార దీక్షలు చేసిన, చేయించిన మంచి నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడు కోరాడ రాజబాబు వీటన్నిటికీ ఎంత? ఖర్చు అయ్యుంటుందో మీకు చెప్ప తగనివాడిని గత 4సంవత్సరాలుగా టీడీపీని పెంచి పోషించిన ఘనత రాజబాబుది భీమిలి ఇంచార్జ్ గా అతని ప్రజల్లో సంపాధించిన ఖ్యతి ని చూడలేని వ్యతిరేకులు ఆయన పై అపవాదు సృష్టించారు నమ్మకండి భీమిలిలో రాజబాబు వైసీపీని సముద్రంలో కలిపివేయగల అపర చాణిక్యుడు టీడీపీ అబ్యర్ధి కాకుంటే? అతనికి వోట్ వేసే అన్ని పార్టీల అభిమానులు, స్వతంత్రులు అయిపోతారు, అది మన పార్టీకి గాని,మిత్ర పక్షానికి గాని చాల నష్టం కలుగుతుంది!కావున కోరాడ రాజబాబునే,మిత్రపక్షాలని ఒప్పించి టీడీపీ ఏమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి భీమిలి విజయాన్ని, విశాఖ ఎంపీ విజయాన్ని నిలబడతారని కోరుకుంటున్నాను అని అన్నారు.