బక్కన్నపాలెం ఫోటో గ్రాఫర్ పోతిన సాయి అదృశ్యం

బక్కన్నపాలెం ఫోటో గ్రాఫర్ పోతిన సాయి అదృశ్యం

మధురవాడ : వి న్యూస్  : మార్చ్ 01: 

మధురవాడ, బక్కన్నపాలెం నివాసితులు పోతిన శ్రీను, పోతిన రమణమ్మ కుమారుడు పోతిన సాయి వయసు 22 గత కొద్దిరోజులుగా కనిపించడం లేదు వివరాలు : ప్రీ వెడ్డింగ్ షూట్ కని వెళ్లిన మధురవాడకి చెందిన పొతిన సాయి ఫోటోగ్రాఫర్ అదృశ్యం అయ్యాడు, గత నాలుగు రోజులుగా చరవాణి స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, తను ఎప్పుడు వృత్తి పని పై వెళ్లిన చరవాణిలో అందుబాటులో ఉండేవాడని అన్నారు, ఈసారి వెళ్ళేటపుడు నాలుగురోజుల క్రితం ఒకసారి మాట్లాడుతూ తెలియని వ్యక్తులతో వెళ్తున్నాను అంటూ ఒక కారు   వెనుక భాగం నుండి చిత్రీకరించి ఆ చిత్రాన్ని పంపాడని ఆ తరువాత చరవానికి అందుబాటులో లేకుండా ఉండటం తో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.