విమ్స్ లో స్ట్రోక్ యూనిట్ ప్రారంభం... -బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు 50 వేలు విలువచేసే ఇంజక్షన్ ఉచితం

 విమ్స్ లో స్ట్రోక్ యూనిట్ ప్రారంభం... 

-బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు 50 వేలు విలువచేసే ఇంజక్షన్ ఉచితం..


విశాఖపట్నం:పెన్ షాట్ 2024 మార్చ్ 01:

అత్యాధునిక సదుపాయాలతో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( విమ్స్) నందు బ్రెయిన్ స్ట్రోక్ యూనిట్ ను శుక్రవారం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ఒత్తిడి కారణంగా వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి రోగులకు వేగంగా కోలుకునేందుకు వీలుగా అత్యాధునిక సదుపాయాలు, మందులతో స్ట్రోక్ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఈ యూనిట్ ద్వారా వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్లను, మెడిసిన్స్ అందించేందుకు న్యూరాలజీ వైద్యులు సిద్ధంగా ఉన్నారన్నారు.  ఇప్పటికే న్యూరో సర్జరీ సేవలు విజయవంతంగా రోగులకు పూర్తిస్థాయిలో అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. 

బ్రెయిన్ స్ట్రోక్ యూనిట్ ద్వారా రూ.50 వేల విలువ చేసే ఇంజక్షన్ ఉచితం

     బ్రెయిన్ స్ట్రోక్ యూనిట్ను ప్రత్యేకంగా విమ్స్ ఆస్పత్రి నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ యూనిట్ ద్వారా హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ సమయంలో అత్యవసరంగా అందించే రూ.50 వేలు విలువ చేసే టేనెక్టెప్లసే (Tenecteplase) ఇంజక్షన్ ను ఉచితంగా అందించటం జరుగుతుందన్నారు. స్ట్రోక్ గాని, హార్ట్ ఎటాక్ గాని వచ్చిన వారు 3 నుంచి 4 గంటల వ్యవధిలో ఈ ఇంజక్షన్ గాని రోగు కు అందిస్తే  లేచి నడుచుకుంటూ తిరుగుతారన్నారు. స్ట్రోక్ వచ్చిన వారు గంటల వ్యవధిలో ఆసుపత్రి చేరుకుంటే ఉచితంగా ఇంజక్షన్ ఇవ్వబడుతుందని తెలిపారు.