అవంతి దారెటు? వైస్సార్సీపీ లో ఉంటారా? లేక పార్టీ మారతారా?
భీమిలికి అక్కరమాని? అయితే భీమిలిలో టీడీపీ, జనసేన జెండా ఎగరడం ఖాయం అంటున్న భీమిలి ప్రజలు.
భీమిలి:వి న్యూస్ : ఫిబ్రవరి 10:
విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మాజీ మంత్రి భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ ( అవంతి శ్రీనివాస్ ) అనగా ప్రజలలో ముందుగా మెదిలేది ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏ పార్టీలోకి వెళతారు అనే మొట్ట మొదటి ప్రశ్న? కారణం లేక పోలేదు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ లో 2009 ఎన్నికల సమయంలో పార్టీలో చేరి మొదట భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి గంటా శ్రీనివాస్ గ్రూప్ ఎమ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకున్నారు, అనంతరం కొన్నాళ్లకే చిరంజీవి అనువార్య కారణాలతో పార్టీ నడపలేక కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసారు, ఆ తరువాత 2012 తెలుగు రాష్ట్రాలు విభజన తరువాత 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ గూటికి చేరిన గంటా గ్రూపులో అవంతి ఒకరు, 2014 టీడీపీ తరపున అనకాపల్లి ఎమ్ పి గా పోటీ చేసి గెలిచారు అయితే 2019 ఎన్నికలకు ముందు ఢిల్లీలో జంతర్ మంథర్ వద్ద టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్ పి లు ప్రత్యేక హోదా నిరసన లో ఉన్న అవంతి రాత్రికి రాత్రి ఏపీ కి వచ్చి వైస్సార్సీపీ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే ఏపీ ప్రజలు అవంతి పై ఒక ఆలోచన కి వచ్చేసారు ఏ పార్టీలోని నిలకడగా ఉండరు ఒక మాట పై ఉండరు ఆయనకి పదవీ వ్యామోహం పదవి కోసం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలీదు కానీ ఎంత ఇబ్బంది ఉన్న పదవి పూర్తిగా అనుభవించి అవకాశం ఉన్న వైపు ప్లేట్ పిరాయిస్తారు అనే భావన లో ఉన్నారు, అలానే భీమిలి నియోజకవర్గంలో వైస్సార్సీపీ తరపున రెండవ సారి ఎమ్మెల్యే గా పోటీ చేసారు అయితే భీమిలి లో టీడీపీ తరపున దివంగత సబ్బం హరి, జనసేన తరపున డాక్టర్ సందీప్ పంచకర్ల పోటీ చెయ్యడంతో ఓట్లు చీలటంతో 2000 స్వల్ప ఆదిక్యంతో నెగ్గారు, టీడీపీ తరపున పోటీ చేసిన సబ్బం హరి గెలుపు దీమాతో కార్యకర్తలను పట్టించుకోవటం తో టీడీపీ కంచుకోటలో మొదటి సారి ఓటమి పాలయింది, 2024 ఎన్నికలలో మూడవసారి భీమిలిలో పోటీచేస్తాను అని చెప్పుకుంటున్న అవంతి కి వైస్సార్సీపీ 2024 ఎన్నికల శంఖరావం సిద్ధం సభ భీమిలిలోనే నిర్వహించారు, అయితే రాజకీయ విశ్లేషకులు కూడా భీమిలి లో అవంతినే పోటీ చేస్తారు సిద్ధం మొదటి సభలో అవంతి ని భీమిలి ఎమ్మెల్యే గా ప్రకటిస్తారు అనుకున్నారు, కానీ అనూహ్యం గా అవంతి ప్రస్తావన కానీ భీమిలి ఎమ్మెల్యే సీట్ కొరకు ఎక్కడ రాలేదు, దానితో అవంతి సీట్ పై అనుకున్నట్టు గానే మళ్లీ ఈయన వైస్సార్సీపీ లో ఉంటారా ఊడుతారా అనే ఆలోచన ప్రజలు లో తీవ్ర చర్చకు దారి తీసింది, ఈ ఆలోచనలో భాగంగా ఆయన అనుచర వర్గంలో తీవ్ర చర్చలు, టీడీపీ లోకి ఆయన కు చోటు ఉండదు కారణం అధ్యక్షులు చంద్రబాబు ని, రాజకీయ గురువు గంటా ను విమర్శించిన ఆయనకు మళ్లీ చోటు ఎలా ఇస్తారు అనే చర్చ, అలాగే జనసేన లో క్యాడర్ అయితే ఉన్న నియోజకవర్గంలో ఆర్ధికంగా ఉన్న నాయకులు లేరు అవంతి అయితే జనసేన లో చేరితే ఆర్ధికంగా జనసేన పుంజుకుంటుంది అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో శుక్రవారం అనూహ్యంగా వైస్సార్సీపీ నుండి తూర్పు నియోజకవర్గం నుండి అక్కరమాని విజయనిర్మల కు అమరావతి కి పిలుపు వచ్చి సాయంత్రం సజ్జల రామకృష్ణ రెడ్డి తో భేటీ అనంతరం ఆమె అనుచర వర్గం సమాచారం మేరకు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఆమెకు నిర్ణయించారని వస్తున్న మాటలతో ఇప్పుడు భీమిలి నియోజకవర్గం లో వైస్సార్సీపీ నాయకులు, అవంతి అనుచర వర్గం భీమిలి ప్రజలలో తీవ్ర చర్చ నడుస్తోంది, మరి అవంతి దారెటు అనే ప్రశ్న ఎక్కువగా చర్చ గా మిగిలిన ప్రశ్న? ఈ చర్చ కు ఉన్న ప్రశ్నలకు రెండు మూడు రోజులలో తెరపడనుందని అంటున్నారు. అయితే భీమిలి ప్రజలు ఊహించి నట్లే అక్కరమానికి భీమిలి ఎమ్మెల్యే గా నిర్ణయిస్తే అవంతి పదవీ కాలం ముగుస్తుండటం ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైస్సార్సీపీ అయ్యాయి ప్రస్తుతం ఏపీలో కీలకమైన అవంతి సామాజిక వర్గం జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్ నాయకత్వంలో చేరే అవకాశం ఉందని అంటున్న భీమిలి ప్రజలు, కారణం భీమిలిలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉండటమే, అక్కరమాని భీమిలి లో పోటీ చేస్తే, టీడీపీ, జనసేన ఉమ్మడి విజయం దాదాపు లంచనమే అంటున్నారు, ఇంకో కారణం కూడా ఉందంటున్నారు ఆమె తూర్పు నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో పోటీ చేసేప్పుడు వైస్సార్సీపీ కి సంపూర్ణ మద్దతు ఉన్న తూర్పు లో అత్యధికంగా ఆమె సామాజిక వర్గం యాడవ సామాజికవర్గం ఓటర్లు ఉన్న గెలవలేకపోయారు, ప్రస్తుతం భీమిలిలో వైస్సార్సీపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు వద్దకు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న వద్ద గెలవడం ఆమెకు కస్టమనే అంటూ భీమిలి టీడీపీ కంచుకోటగా ఉన్న భీమిలిలో టీడీపీ, జనసేన జెండా ఎగరడం దాదాపు కాయం అంటున్నారు. అవంతి అనుచర వర్గం మాత్రం అవంతికే భీమిలి సీట్ వస్తుంది అనే ఆశాభావంతో ఉండగా కాపు సామాజిక వర్గం మాత్రం కొందరు అవంతి కాకుండా వేరొకరికి భీమిలి కేటాయిస్తే వైస్సార్సీపీ నుండి వైదోళగటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది,