శుక్రవారం రేవళ్లు గ్రామంలో శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ తీర్ధ మహోత్సవం.

శుక్రవారం రేవళ్లు గ్రామంలో శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ తీర్ధ మహోత్సవం.            

చోడవరం : వి న్యూస్ : ఫిబ్రవరి 22:   


              అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రేవళ్లు గ్రామంలో శుక్రవారం శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ తీర్ధ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చోడవరం దస్తావేజు లేఖరి బొబ్బిలి చంద్రశేఖర్ తెలిపారు. ఈ తీర్ధ మహోత్సవం లో తెల్లవారుజామున 6గంటలనుండి స్వామి వారికి దీప దూప నైవేద్యములతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, స్వామి వారి ఊరేగింపులో చిరుత వేషాలు, తప్పేడుగుళ్ళు, తొడపెద్దులు, నెలవేశములతో, చిటికల భజనలతో, మండుగుండు సామాగ్రితో పండుగ మహోత్సవం అతి వైభవముగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు, మధ్యాహ్నం 2గంటలకు ఎడ్ల బండ్లు పరుగు ప్రదర్శన సాయంత్రం 4గంటలకు శ్రీ గౌరీ ముత్యాలమ్మ కోలాట బృందం వారిచే కోలాటం నృత్య ప్రదర్శన కడు రమ్యముగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు, మరియు జనసేన జిల్లా కార్యదర్శి సిరిపురపు రమేష్ ఆర్ధిక సహాయంతో డాన్స్ బేబీ డాన్స్ అత్యంత వైభవముగా నిర్వహిస్తున్నామని కావున ప్రజలు యవ్వన్మoది రేవళ్లు గ్రామం విచ్చేసి అభయాంజనేయ తీర్ధ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరారు.