చంద్రబాబు లోకేష్ బాబు కు టీడీపీ బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆనంద్ బాబు గొల్లంగి విజ్ఞప్తి!
మధురవాడ : పెన్ షాట్ : ఫిబ్రవరి 26:
చంద్రబాబు లోకేష్ బాబు మీరు భీమిలికి ఇంచార్జ్ గా కోరాడ రాజబాబు ను ప్రకటించిన నాటి నుండి నేటివరకు టీడీపీ కేడర్ ను పెంచుతూ వారితో ప్రతిరోజూ మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ ఆదేశాలమేరకు వారితో పనిచేయుస్తు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ,అధికారులను, పోలీస్ వారిని, స్థానిక వైస్సార్సీపీ ఏమ్మెల్యే అవంతిని ఎదుర్కొంటు, అద్భుత ప్రతిభతో పని చేస్తూ టీడీపీకి అభిమానులను పెంచుతూ భీమిలిని టీడీపీకి కంచుకోటగా తయారు చేసిన లోకల్ నాయకడు కోరాడ రాజబాబు ని ఏమ్మెల్యే అబ్యర్ధిగా ప్రకటిస్తారని భీమిలి ప్రజలు టీడీపీ కేడర్ యావత్తు ఎదురు చూస్తుంది విశాఖపట్నంలో జోన్ 1 సమావేశంలో 35 నియోజకవర్గాలలో రాష్ట్ర టీడీపీ ఆదేశాలు మేరకు బాగా పనిచేశారని భీమిలికి 2వ స్థానం తేచ్చిన ఘనత రాజబాబుది పోలవరం వరదలతో మునిగినప్పుడు రాష్ట్ర టీడీపీ ఆదేశాలతో 5టన్నుల బియ్యం,9రకాల నిత్యావసర సరుకులను 300కుటుంబాలకు పంచి, వారిని ఆదుకున్న ఘనత రాజబాబుది కష్టపడి పనిచేసే ఇంచార్జ్ లలో రాజబాబు ముందున్నారు. కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడే కోరాడ రాజబాబు నూరు శాతం ఏమ్మెల్యే అబ్యర్దికి అర్హులు కష్టించి పని చేస్తేనే ఏమ్మెల్యే అబ్యర్దికి అర్హులు అని, చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఎప్పుడు చెబుతూనే వున్నారు, ఆ మాటే నిజమయితే కోరాడ రాజాబాబుని భీమిలి టీడీపీ ఏమ్మెల్యే అబ్యర్ధిగా ప్రకటించండి రాజబాబు ని సుమారు 50వేల ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి భీమిలి యావత్తు ప్రజలు మరియు టీడీపీ కేడర్ యావత్తు సిద్ధంగా ఎదుచూస్తుంది అని టీడీపీ బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆనంద్ బాబు గొల్లంగి కోరారు.