భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ సీట్ కొరకు దరఖాస్తు చేసిన గరే వెంకట రమణ.

భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ సీట్ కొరకు దరఖాస్తు చేసిన గరే వెంకట రమణ.              

పీఎంపాలెం : పెన్ షాట్ ప్రతినిధి : ఫిబ్రవరి 10:   



భీమిలి నియోజకవర్గం, మధురవాడ, పోతిన మల్లయ్యపాలెం కి చెందిన గరే వెంకట రమణ 6వవార్డ్ వైస్సార్సీపీ పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహారించారు, అయితే ఆయన పై ఆ పార్టీ వ్యక్తులే ఆయన పై తప్పుడు సమాచారం భీమిలి ఎమ్మెల్యే కి చేరవేసి ఆయన పార్టీ కి దూరమయ్యే విధంగా చెయ్యటంతో ఆయన వైస్సార్సీపీ పార్టీపై పూర్తిగా అసహనంతో దూరమయ్యారు, అయితే పార్టీకే కాకుండా ప్రత్యక్ష రాజకీయాలకే దూరంగా ఉన్నారు, అనూహ్య రీతిలో కర్ణాటక, తెలంగాణలో పుంజుకుని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలను శనివారం విజయవాడ లో కలిసి భీమిలి ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు దరఖాస్తు అందచేశారు.  రానున్న ఎన్నికలలో పోటీ కాంగ్రెస్ తరపున పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశిస్తే భీమిలిలో చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గరే వెంకట రమణ తెలిపారు.