అనంతపురం కాంగ్రెస్ రాష్ట్ర పునరనిర్మాణ పోరాట సభకి తరలి రావాలి : విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గొంప గోవింద్ రాజు

అనంతపురం కాంగ్రెస్ రాష్ట్ర పునరనిర్మాణ పోరాట సభకి తరలి రావాలి : విశాఖ జిల్లా  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గొంప గోవింద్ రాజు                      

మధురవాడ : వి న్యూస్ : ఫిబ్రవరి 24:   

కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మిత్రులు ,అందరికీ వందనాలు  మిత్రులారా ఫిబ్రవరి 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అనంతపురంలో జరిగే "రాష్ట్ర పునర్నిర్మాణ పోరాట" సభ కు మీరంతా తరలిరావాలని కోరుతున్నాను. ఈ సభలో మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే , ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి , మరియు పలువురు జాతీయ రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ భారీ బహిరంగ సభలో మన జాతీయ అధ్యక్షులతో సహా పలువురు నేతలు మనకు దిశానిర్దేశం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు  వివరిస్తారు. కనుక మనమంతా విశాఖ జిల్లా నుండి మరియు భీమిలి నియోజకవర్గం నుండి అనంతపురం తరలి వెళ్లి భారీ బహిరంగ సభ జయప్రదమయ్యేoదుకు మన వంతు సహకారం అందించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని  విశాఖ జిల్లా  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గొంప గోవింద్ రాజు తెలిపారు. భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మధురవాడ (కే ఆర్ ఎమ్ జ్యువలర్స్) అధినేత కరణం రామ్ మోహన్ నాయుడు భీమిలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తరలి రావాలని కోరారు.