భీమిలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన కే ఆర్ ఎమ్ జ్యువలర్స్ అధినేత కరణం రామ్ మోహన్ నాయుడు.

భీమిలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన కే ఆర్ ఎమ్ జ్యువలర్స్ అధినేత కరణం రామ్ మోహన్ నాయుడు.            

మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : ఫిబ్రవరి 23 :

భీమిలి నియోజకవర్గం, మధురవాడ ( కే ఆర్ ఎమ్ జ్యువలర్స్ అధినేత ) కరణం రామ్ మోహన్ నాయుడు, అనూహ్య రీతిలో కర్ణాటక, తెలంగాణలో పుంజుకుని  విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ను విజయవాడలో కలిసి భీమిలి అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యులుగా పోటీ చేసేందుకు దరఖాస్తు అందచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ లో వై ఎస్ షర్మిల భాద్యతలు తీసుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం అయ్యి రానున్న ఎన్నికలులో విజయం సాధిస్తుందని అన్నారు. అదేవిదంగా రానున్న ఎన్నికలలో పోటీ కాంగ్రెస్ తరపున పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశిస్తే భీమిలిలో చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు శుక్రవారం మీడియా ముఖంగా మధురవాడ ( కే ఆర్ ఎమ్ జ్యువలర్స్ అధినేత ) కరణం రామ్ మోహన్ నాయుడు తెలిపారు. భీమిలిలో పోటీకి  కాంగ్రెస్ అధినేత వై ఎస్ షర్మిల దాదాపు నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.