ముద్రగడ పద్మనాభం బహిరంగ లేక పై స్పందించి పత్రికా ముఖంగా ఖండించిన టీడీపీ బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆనంద్ బాబు గొల్లంగి.
మధురవాడ :వి న్యూస్ ప్రతినిధి : మార్చ్ 01:
ముద్రగడ పద్మనాభం నమస్కారం టీడీపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మీరు ఒక బహిరంగ లెటర్ వ్రాసారు అందులో మీరు చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ ఇళ్లలోనుంచి బయటకు రావడానికి భయ పడ్డారు అనివ్రాసిన విషయాన్నీ ,ఆనందబాబు గొల్లంగి టీడీపీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షునిగా కండిస్తున్నాను, చంద్రబాబు జైల్లో వున్నప్పుడు టీడీపీ కేడర్ మొత్తం రాష్ట్రంలో,దేశంలో మరియు 108విదేశాలలో తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసారు,తెలుసుకోండి పోలీస్ వ్యవస్థతో వైస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాల నుండి పట్నాలవరకు టీడీపీ కేడర్ను ఇళ్లల్లోనే అరెస్ట్ చేసి బయటకు రాకుండా చేసారు,ఎలాగోలా బయటకు వచ్చి నిరసన తెలియ పరిచిన వారిని అరెస్ట్ లు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు చంద్రబాబు నాయుడు జైల్లో వున్నన్ని రోజులు 175 నియోజకవర్గాలలో యావత్తు టీడీపీ కేడర్ నిరాహార దీక్షలు చేసిన విషయం తెలుసుకోండి! అప్పుడు స్వాతంత్రం కోసం ప్రజలు ఏవిధంగా పోరాటం చేశారో ఆ విధంగా టీడీపీ కేడర్ యావత్తు,చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన, వైస్సార్సీపీ ప్రభుత్వం చర్యలపై ,టీడీపీ కేడర్ మొత్తం న్యాయ పరంగా చట్టాన్ని అతిక్రమించకుండా పోరాటాలు /నిరసన చేసిన విషయం ఈ ప్రకటన ద్వారా మీకు తెలియ పరుస్తున్నాను. కండిస్తున్నాను! ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమoడ్రి జైలు కు వెళ్లి చంద్రబాబు నాయుడు ని ని కలవడం టీడీపీ /జనసేన మిత్రత్వానికి బలం చేకూరుంది! ఆలా కలవడం ద్వారా ఆంద్రప్రదేశ్ ను రాక్షసంగా పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టి పాలన చేస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ నికి వ్యతిరేకంగా పడే ఏ వోట్ మిస్ అవకుండా చేయడానికి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి జరిగిన టీడీపీ జనసేన మైత్రి ఇది! దీన్ని పాడుచేయడానికి అన్నట్టు మీరు వ్రాసిన లెటర్ వుంది! అన్ని తెలిసిన పెద్దలు మీరు ,పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించి వారితో కలసి పనిచేయాల్సింది పోయి 80 సీట్లు అడగాలి ,సీఎం పోస్ట్ అడగాలి అన్న మీ విజ్ఞాపన చాల తప్పు అని కoడిస్తున్నాను! ప్రస్తుత పరిస్థిలో పవన్ కళ్యాణ్ మీకన్నా గొప్పవారు 24సీట్లు ,3 పార్లమెంట్ సీట్లు తీసుకొని టీడీపీ స్నేహంతో తప్పక అన్ని గెలవగలరు! మిగతా 151 సీట్లు,22 పార్లమెంట్ స్థానాలు టీడీపీ ఇతర మిత్ర పక్షాలతో కలిపి సాధించగలదు అని పత్రికా ముఖంగా ముద్రగడ పద్మనాభంకి తెలియ పరుస్తు దయవుంచి మా టీడీపీ జనసేన మిత్రత్వాన్ని చెడగొట్ట వద్దని కోరుతున్నారు.