రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లాపై గెలిచిన వైజాగ్ జేశాఫ్

రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లాపై గెలిచిన వైజాగ్ జేశాఫ్

విశాఖ : వి న్యూస్  : ఫిబ్రవరి 28:       


                 అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో  ఏపీడబ్ల్యుజే యు రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ రామ లింగారెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టుల రాష్ట్రస్థాయి యూనిట్ కప్ 2024 క్రికెట్ టోర్నీని నిర్వహించారు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్( JSAAP) తరపున వైజాగ్ నుండి వాల్మీకి నాగరాజు నేతృత్వంలో టోర్నీ లో పాల్గొన్నారు. మంగళవారం నాడు  అనంతపురంలో ఏసీజి గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో చిత్తూరు జిల్లా vs వైజాగ్ తలపడగగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వైజాగ్ జేశాఫ్ 20 ఓవర్ లో 182 పరుగులు చేసింది సురేష్ 54 బంతుల్లో 110 పరుగులు చేయగా బ్యాటింగ్ దిగిన చిత్తూరు జిల్లా 169 పరుగులు చేసి కుప్పకూలిపోయింది. వైజాగ్ జెశాఫ్ టీమ్ లో బౌలింగ్ ప్రతిభ చూపిన సురేష్ 4 టికెట్లు తీసి 23 పరుగులు ఇవ్వగా సంతోష్ కుమార్ 3 వికెట్లు తీసి 30 పరుగులు ఇచ్చి టీమ్ గెలుపుకి కారణం అయ్యారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసరావు వైజాగ్ జేశాఫ్ టీమ్ ని అభినందించారు. టీమ్ సభ్యులందరూ ఫీల్డింగులో అద్భుతమైన ప్రదర్శన చేశారని తోటి టిమ్  సభ్యులందరరు కొనియాడారు.