వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే కొన్ని వార్తా చానళ్ల ప్రసారాలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు:పిట్ట సురేష్
భీమిలి :వి న్యూస్ : ఫిబ్రవరి 22:
ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పబడే మీడియాపై దాడులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తీవ్రంగా జరుగుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేష్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే కొన్ని వార్తా చానళ్ల ప్రసారాలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు, ఇప్పటికీ కొన్ని చానల్స్ సీరియల్ అయితే ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి.స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో హాజరైన మీడియా ప్రతినిధుల్లో ఒక విలేకరిపై ఎమ్మెల్యే అనుచరుడు పిడుగుద్దులు గుద్ది తీవ్ర గాయాలు చేసి ఆసుపత్రి లో చికిత్స పొందిన పరిస్థితి. మొన్న రాప్తాడు లో వైసిపి కార్యకర్తలు అందరూ కలిసి ఒక్క మీడియా ప్రతినిధి పై మూకుమ్మడి దాడి చేసి భయాందోళనలు కలిగించారు. నిన్నటికి నిన్న పత్రికా కార్యాలయం పై దాడి చేసి ఆ ప్రాంతంలో ఉన్నవారిని , ఉద్యోగుల్ని ప్రాణ భయంతో పారిపోయినట్టుగా తరిమారు.
ఇంకా బయటపడని సంఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు స్పందించి బాధ్యులపై కనీస చర్యలు చేపట్టకుండా, ఇది తీవ్రమైన చర్య అని కనీసం ఖండించకుండా వేడుక చూస్తున్న ముఖ్యమంత్రి చర్య తీవ్రమైనది.మీడియా అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అంటారు. అటువంటి వారధి సైనికులను భయపెట్టి నిజాలను బయటకు చెప్పనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ పార్టీ నేతల చర్యలు క్షమించరానివి. రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం నిశ్శబ్దం పాటించడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం