రాప్తాడులో జర్నలిస్ట్ పై దాడులను ఖండిస్తూ నిరసన తెలిపిన భీమిలి, పద్మనాభం, తగరపువలస, ఆనందపురం మీడియా ప్రతినిధులు.
ఆనందపురం : వి న్యూస్ : ఫిబ్రవరి 22:
రాప్తాడు లో జర్నలిస్ట్ పై దాడులను ఖండించిన తగరపువలస, భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, తగరపువలస కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మీడియా ప్రతినిధులు, అనంతరం భారీ ర్యాలీగా ఆర్డిఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీవో కు వినతి పత్రం అందించిన మీడియా ప్రతినిధులు . వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దాడి చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేసారు.