భీముని పట్నం కాంగ్రెస్ పార్టీ బీ పామ్ పై ఎన్నికలు లో పోటీ కీ తెడ్డు రామదాసు సిద్ధం

భీముని పట్నం కాంగ్రెస్ పార్టీ బీ పామ్ పై ఎన్నికలు లో పోటీ కీ తెడ్డు రామదాసు సిద్ధం 

భీముని పట్నం మండలం:  వి న్యూస్ ప్రతి నిధి (ఫిబ్రవరి 2):-

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రత్న భవన్ విజయవాడ నందు భీమునిపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెడ్డు రామదాసు దరఖాస్తు ను ఎన్నికల దరఖాస్తు పరిశీలకులకు దరఖాస్తు చేయడం జరిగింది . 2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. మరొకసారి అధిష్టానం ఆదేశించి భీముని నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ అధిష్టానని అభ్యర్థించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కోసం విభజన హామీలు అమలు కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాటాలు చేస్తుంది. ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఒక్క పరిశ్రమ ను కూడా స్థాపించలేదు. ఏ ఒక్కరికి కూడా ఎంప్లాయిమెంట్ లేక ప్రజలు, ముఖ్యంగా యువత ఎంతో నిరాశతో ఉన్నారు. మరి వారి సంక్షేమం కోసం పెద్దలు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరా రెడ్డి , సి డబ్ల్యూ సి సభ్యులు రుద్రరాజు ,మరియు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో ప్రత్యేక హోదా విభజన హామీల అమలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విశాఖ రైల్వే జోన్ దీక్ష లో ఉండటం మీకు తెలియజేయడం జరుగుతుంది.