కితిన్ పేట గ్రామంలో మెగా రక్తదాన శిబిరం కంటి పరీక్ష ప్రారంభంలో పాల్గొన్న స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి.
భీమిలి : వి న్యూస్ ప్రతినిధి : ఫిబ్రవరి 10:
భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఓఎస్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమిలి మండలం కితిన్ పేట గ్రామం లో ఉన్న సన్ స్కూల్ వద్ద అధినేత కైతంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 23వ మెగా ఉచిత రక్తదాన శిబిరం,కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశాఖ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి డాక్టర్.రత్నం రాజు సిబ్బంది సుమారు 200 మందికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.రోటరీ బ్లడ్ బ్యాంక్ డా.వి కళ్యాణ రావు, డా.అశోక్ కుమార్,చైర్మన్ కె.వి శ్రీనివాసరావు, కె.వి రమణ సిబ్బంది కలిసి రక్త దానం చేసిన 90 వ్యక్తుల నుండి రక్తం సేకరించారు.వీళ్ళకు రెండు లక్షల ఇన్సూరెన్స్ బాండ్ ను సన్ స్కూల్ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు ఇండిపెండెంట్ అభ్యర్థి నాగోతి.నాగమణి చేతులు మీదగా అందజేశారు.ఈ కార్యక్రమంలో సన్ స్కూల్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ బ్లెస్ అధినేత కె.లావణ్య,భరద్వాజ నగోతు నాగమణి టీమ్ రక్త దానం చేసి పలువురికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమములో ఓఎస్జి ఫౌండర్ శివ దళాయి, వెంపాడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ వి. శ్రీనివాసరెడ్డి,టిడిపి రాష్ట్ర నాయకులు గంట నూకరాజు, ఎంపీటీసీ కోరాడ. రమణ,సన్ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ సీరఫు ఉమా మహేశ్వర రావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.