రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యపై హత్యాయత్నం.
కొమ్మాది : వి న్యూస్ : ఫిబ్రవరి 03:
ప్రథమ చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు,ఇంటికి వెళ్లి దాడి చేసిన దుండగులు
మధురవాడ కొమ్మాదిలో ఘటన
ఇటీవలే విజయనగరానికి ఎన్నికల నేపథ్యంలో బదిలీ
వాచ్మెన్ కేకలు వేయడంతో పరారైన దుండగులు
ప్రాణాపాయ స్థితిలో తహసీల్దార్ రమణ
ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
కేసు నమోదు చేసిన పోలీసులు
నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు
విశాఖ రూరల్ తాసిల్దార్ పై హత్యయత్నం జరిగింది. అయిన ఇంటికి వెళ్లి మరీ
దుండగులు దాడి చేశారు.వాచ్మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి
నుంచి పరారయ్యారు. వెంటనే తహసిల్దారును ఆపోలో హాస్పటల్కు ప్రథమ చికిత్స
కోసం తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మధురవాడ కొమ్మాది ఎన్జీ
పిల్ థియేటర్ వెనక చరణ్ క్యాస్ట్రాల్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న తహసీల్దార్
నానాపల్లి రమణయ్య నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతనిపై ఇనుప
రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఇటీవలే రూరల్ నుండి ఎన్నికల నేపథ్యంలో
విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. ఇంతలోనే ఈ అనుకోని ఘటన చోటు
చేసుకుంది. అతను తలపై తీవ్రంగా గాయాలు కావడంతో ఒక్కసారిగా తహసిల్దార్
కుప్పకూలిపడిపోయారు. వార్మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ నలుగురు దుండగులు
తహసిల్దారును
అపోలో ఆస్పత్రి
కి తరలించారు.
ప్రస్తుతం అతని పరి
స్థితి విషమంగానే ఉన్నట్లు
వైద్యులు చెబుతున్నారు. ఈ
ఘటనతో ఒక్కసారిగా రెవెన్యూ
యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి
పడింది. సమాచారం అందు
కున్న స్థానిక పోలీసులు సంఘటన
స్థలానికి చేరుకున్నారు. నిందితుల
కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా అన్వేషణ
కొనసాగుతుంది. ఘటన స్థలానికి వచ్చిన సిపి. జాయింట్ సిపి, డీసీపీ కూడా రావడం
జరిగింది. రురల్ తహశీల్దార్ గా ఉన్నప్పుడు నిక్కచ్చిగా అధికార విధులు నిర్వహించే
రమణభ్యూ కణాల కు కళ్లెం వేయడం లో గుర్తింపు ఉన్న అధికారిగా పేరు ఉంది. ఈ
కారణములో ఎవరైనా అతనిపై దాడి చేశారా అని అనుమానాలు వ్యక్తం
అవుతున్నాయి. లేదా మరేదైనా కారణమై ఉంటుందానే కోణంలో కూడా పోలీసులు
విచారణ చేపట్టారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.