వాంబేకాలనీలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగి మహేష్ 7వ వర్ధంతికి ఘన నివాళులు,

వాంబేకాలనీలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగి మహేష్ 7వ వర్ధంతికి ఘన నివాళులు,              

వాంబేకాలనీ : వి న్యూస్  : ఫిబ్రవరి 28:                   


              మధురవాడ, 7వవార్డ్, వాంబేకాలనీ గాంధీ విగ్రహం వద్ద వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగి మహేష్ 7వ వర్ధంతికి తన కుమారులు వేగి నూకరాజు, వేగి రామిరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్,మాజీ కార్పొరేటర్ 5వ వార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన హనుమంతు రావు పాల్గొని సుమారు 150 మంది వృద్దులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నగరాల చైర్మన్ పోతిన శ్రీనివాస్ మాట్లాడుతూ సీనియర్ వైస్సార్సీపీ నాయకులు వేగి మహేష్ వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి వాంబేకాలనీలో జెండా మోసిన మహేష్ వర్ధంతికి నివాళులు అర్పించి తన కుమారులు ఇద్దరు ప్రతీ యేటా వృద్దులకు నిత్యావసర సరుకులు పంపిణీ నా ద్వారా చేయిస్తూ ఉన్నారని, ప్రతీ యేటా తండ్రిని ఆయన సేవలను స్మరిస్తూ నిర్వహిస్తున్నారని మహేష్ కుమారులను అభినందించారు, తండ్రి వలె తనయులు ఇద్దరూ ఆయన బాటలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని అభిమానిస్తూ వైస్సార్సీపీ పార్టీని వాంబేకాలనీలో విస్తరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు డాక్టర్ సనపల కాంతారావు, సచివాలయం కన్వీనర్ ఎల్లాజీ, వాసు, తదితరులు పాల్గొన్నారు.