మధురవాడ చంద్రంపాలెంలో 59వ సచివాలయం పరిధిలో మధురవాడ పి హెచ్ సి వైద్యాధికారులు పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంపు
మధురవాడ : వి న్యూస్ : ఫిబ్రవరి 22:
మధురవాడ చంద్రంపాలెంలో 59వ సచివాలయం పరిధిలో మధురవాడ పి హెచ్ సి వైద్యాధికారులు పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంపు గురువారం నిర్వహించారు, ఈ మెడికల్ క్యాంపులో అన్నిరకాల చికిత్సలు, కంటి పరీక్షలు నిర్వహించారు,ఈ మెగా మెడికల్ క్యాంపులో సుమారు 200 మందికి రోగులకు వైద్యం అందించారు, పరీక్షలు అనంతరం వైద్యులు రోగులకు సంబంధిత రోగ నివారణకు మందులు అందచేశారు,ఈ కార్యమానికి వచ్చిన రోగులకు జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆదేశాలతో మలేరియా, డెంగీ ఏఎన్ఎమ్ సూపెర్వైసర్ బేబీ రాణి ఆధ్వర్యంలో మలేరియా సిబ్బంది ప్రజల ఆరోగ్యం కొరకు ఇంటి ఇంటికి తిరిగి ఇళ్లలలో నిల్వ ఉన్న నీటిలో తయారయ్యిన లార్వా సేకరించి క్యాంపుకు వచ్చిన వారికి లార్వా వల్ల దోమలు ఏవిధంగా వృద్ధి చెందుతాయో క్లుప్తంగా వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు, క్యాంపుకు వచ్చిన వారు వైద్యం చేస్తున్న వైద్యులు, మలేరియా డెంగీ పై అవగాహన కల్పిస్తున్న సిబ్బందిని ప్రజల ఆరోగ్యం కొరకు వారు చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎమ్ లు, మలేరియా సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.