ఆల్ ఇండియా తూర్పుకాపు బిజినెస్ నెట్వర్క్ ఆత్మీయ సమావేశం విజయవంతం.

ఆల్ ఇండియా తూర్పుకాపు బిజినెస్ నెట్వర్క్ ఆత్మీయ సమావేశం విజయవంతం.

అరసవిల్లి : వి న్యూస్ : జనవరి 10: 

తూర్పుకాపు బిజినెస్ నెట్వర్క్ వ్యవస్థపక అధ్యక్షుడు గంటెడా మోహన్ కుమార్ మరియు రాష్ట్ర తూర్పుకాపు సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు సేపేనా శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఆల్ ఇండియా తూర్పుకాపు బిజినెస్ నెట్వర్క్ ఆత్మీయ సమావేశం మరియు ఉత్తరాంధ్ర రైతు సదస్సు శ్రీకాకుళం లో స్థానిక అరసవిల్లి రోడ్డులో ఉన్న ఇందిరా విజ్ఞాన్ భవన్ ఫంక్షన్ హాల్  అట్టహాసంగా జరిగి విజయవంతం అయ్యింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పల్సస్ గ్రూప్ అధినేత డాక్టర్ గేదెల శ్రీనుబాబు గారు ముఖ్య అతిధిగా హాజరు అయ్యి డిజిటల్ మార్కెటింగ్, అగ్రిప్రేణుర్షిప్, ఎంటర్ప్రెనుర్షిప్ కోసం యువతకి ముఖ్యమైన సలహాలు సూచనలు చేసారు. ఈ సమావేశానికి తూర్పుకాపు పారిశ్రామాక వేత్తలు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ , చిన్న పెద్ద వ్యాపార వేత్తలు, మరియు వివిధ వ్యాపారలలో ఉన్న తూర్పుకాపు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరు అయ్యి భారీ ర్యాలీ తో ముఖ్య అతిధికి గణస్వాగతం పలికారు. ఈ సందర్బంగా మోహన్ మాట్లాడుతూ తూర్పుకాపు జాతిని ఎకతాటిపైకి తీసుకురావడం కోసం ,పరస్పర సహాయాసహకారాలు అందించుకుంటూ వ్యాపారాలను  ప్రోత్సాహించడం కోసం , ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందటమే ముఖ్య లక్ష్యంగా ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది అని తెలియచేసారు. ఈ సదస్సులో రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్స్ కార్యదర్శి అనేపు రామకృష్ణ,జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు సురంగి మోహన్ రావు,లంక గాంధీ, ఉద్యోగ విభాగం అధ్యక్షులు బలగ మల్లేశ్వర్రావు,రౌతు గోపి,ఎం రామజోగినాయుడు,ఏటీవో అప్పారావు,జిల్లా మీడియా ప్రెస్డెంట్ శాసపు జోగినాయుడు,ఎల్ వి రాజశేకర్,ఇజ్జాడా శ్రిను,వాళ్లే శ్రీరాములు నాయుడు,డోల బాలు,మిర్తివాడ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.