రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఓబీసీ సమస్యలపై భేటీ అయ్యిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతిన పైడిరాజు.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : జనవరి 22:
మధురవాడ భీమిలి నియోజకవర్గం పరిధిలోని సోమవారం ఉదయం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతిన పైడిరాజు మధురవాడ స్వతంత్ర నగర్ కాలనీలో విశ్వకర్మ పూజ కార్యక్రమం పాల్గొని బిసి కులస్తులను కలిసి విశ్వకర్మ పూజ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు వారితో కలిసి ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు మరియురాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ వారిని కలిసి బీసీల పలు సమస్యలపై వినతి పత్రం అందచేసి ఓబీసీ ల సమస్యలను పరిష్కరించి సహకరించాలని కోరారు.ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు.