అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి: న్యాయవాది మడివి రవితేజ
వి న్యూస్ ప్రతినిధి జనవరి 14 చింతూరు:
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని 33వ రోజు సమ్మెను న్యాయవాది మడివి రవితేజ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మడివి రవితేజ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని దాదాపు 33వ రోజుల నుండి సమ్మె చేస్తున్న కూడా ఈ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దాంట్లో చాలా మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. అంగన్వాడి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను ప్రారంభించి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీను నెరవేర్చాలి అంగన్వాడి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి 2017 నుండి టిఏడిఏ బిల్లులు కూడా చెల్లించాలి.మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలి.రిటర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలురూపాయలు కల్పించాలి.రిటర్మెంట్ వయసును పెంచాలి.నాణ్యమైన సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ కార్మికుల సమ్మె చేస్తుంటే వాళ్లు మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తున్న దుర్మార్గమైన జగన్ ప్రభుత్వం.మీరు చేస్తున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మా న్యాయవాదులు అందరు కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్.అంగన్వాడి యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి నూకరత్నం ప్రాజెక్ట్ అధ్యక్షులు వెంకటరమణ కోశాధికారి కామేశ్వరి.అంగన్వాడి యూనియన్ సభ్యులు కనకదుర్గ.భద్రమ్మ.ముత్తమ్మ. సత్యవతి.విజయకుమారి.తదితరులు పాల్గొన్నారు