చెక్ పోస్టులను సందర్శించిన అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ .ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్
ఆనందపురం : వి న్యూస్ : జనవరి 20:
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నగర సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సందర్శించిన అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ .ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్ సరిహద్దులలో 01.పద్మనాభం వద్ద గల చిన్నా పురం జంక్షన్ వద్దా,02. ఆనందపురం పరిధిలో గల భీమిలి క్రాస్ రోడ్స్ వద్ద నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్న చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం నగర పోలీసు కమిషనర్ పై చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసి, చెక్ పోస్టు పనితీరు, అక్కడ గల వసతులను పరిశీలించారు, చెక్ పోస్టు పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు, గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారిస్తూనే , సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్రమ మద్యం, నగదు, ఇతర అనుమానిత వస్తువులను పూర్తిగా నివారించేలా అన్ని వాహనాలను నిరంతరం తనిఖీలు నిర్వహించాలని తెలుపుతూ, పలు అంశాలను గమనించి తగు ఆదేశాలను జారీ చేశారు.