భీమిలి నియోజకవర్గం ప్రజల కష్టాలను తెలుసుకుని సహాయం చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి

భీమిలి నియోజకవర్గం ప్రజల కష్టాలను తెలుసుకుని సహాయం చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి 

భీమిలి: వి న్యూస్ : జనవరి 10: 

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి టు దొర తోట ఎస్సీ కాలనీలో బీ వెంకట్రావు అనే వ్యక్తి తన రెండు కిడ్నీలు కోల్పోయి దాతల కోసం ఎదురుచూస్తూ ప్రాణాన్ని అరిచేతులో పెట్టుకొని జీవనం సాగిస్తున్న వెంకట్రావు కోసం ఓ ఎస్ జి ఫౌండేషన్ శివ దళాయి ద్వారా తెలుసుకొని బుధవారం భీమిలి నియోజకవర్గం లో రానున్న రోజుల్లో 2024 గాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణి బాధితులను పరామర్శించి వారి మంచి చెడ్డలు తీసుకొని వారికి తమా శక్తి కొలది ఆర్థిక సాయం చేసి ధైర్యం చెప్పి నేను మీ ఇంటి ఆడపిల్లని మీకు సమస్య వస్తే నాకు సమస్య వచ్చినట్టే నా కుటుంబంలో కష్టం వస్తే ఆదుకోవడానికి నేనెప్పుడూ ముందుంటానని అదేవిధంగా పర్యటనలో భాగంగా గ్రామాల్లో చాలా అవకతవకలు నేను గమనించాను నన్ను గాని మీరు రానున్న ఎలక్షన్ లో గెలిపిస్తే ఆ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.