జనవాసాల మధ్య అక్రమంగా నియమిస్తున్న ఎయిర్టెల్ సెల్ టవర్ ను వెంటనే నిలబడితే చేయాలి;
అమలాపురం( వి న్యూస్ ప్రతినిధి) 14 జనవరి 2024;
కామనగరువు పంచాయతీ పరిధి మేధా గార్డెన్ ఆనుకుని ఉన్న జనావాసాల మధ్య అక్రమంగా నిర్మిస్తున్న ఎయిర్టెల్ టవర్ ను వెంటనే నిలుపుదల చేయాలని గ్రామస్తులు అందరూ టవర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది నెల క్రితం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో నిలుపుదల చేయమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పనులు రాత్రి సమయంలో చేసి టవర్లు పూర్తి చేయడం జరిగింది. ఈ టవర్ నిర్మాణం జరిగినట్లయితే ప్రజల ఆరోగ్యానికి రేడియేషన్ వచ్చే అవకాశం ఉందని,అదే విధంగా మానసిక సమస్యలు, గర్భిణీ స్త్రీలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వెంటనే టవర్ ను నిలుపుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు .ఈ కార్యక్రమంలో యస్. సత్తిరాజు,జి.సుధాకర్,యం.రామకృష్ణ,నాగేశ్వరరావు,కోలా త్రిమూర్తులు,యస్.మురళీ, వై.మూర్తి,కె.ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.