బొట్టవానిపాలెం లో_ఘనంగా శ్రీ రాముని ఊరెంగింపు
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : జనవరి 22:
భారతదేశ చరిత్ర లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అయోధ్య బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా బొట్టవానిపాలెం లో గల శ్రీ కోదండ రామాలయం లో గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యం ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ భక్తులందరూ మేళాతాలతో ఘనంగా ఊరేగించారు.ఈ కార్యక్రమంలో బొట్టవానిపాలెం గ్రామ పెద్దలు మాట్లాడుతూ రాముని జన్మస్థలమైన అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగడం ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప అరుదైన ఘట్టమని, కావున రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మా గ్రామం లో గల కోదండ రామాలయం లో ప్రత్యేక పూజలు చేసి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించడం జరిగిందని తెలిపారు.