అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో సంక్రాంతి సంబరాలు.
అయినవిల్లి( వి న్యూస్ ప్రతినిధి) 15 జనవరి:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి లో స్వయంభు ప్రసిద్ధమైనటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఎంతో వేడుకగా చైర్మన్ గుత్తుల నాగబాబు మరియు ఈవో సత్యనారాయణ రాజు ప్రాచీన కాల సంప్రదాయ సంస్కృతులు ఉండేలా రంగ రంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించినారు. గంగిరెడ్డి మేళాలు డు డు బసవన్న అంటూ నాట్యం చేయించినారు. వేదమంత్రాలుతో భోగి దండలతో అగ్ని హోమము తయారుచేసి భోగిమంటను వేసినారు. హరిదాసులు హరి నామములతో దేవాలయము మారుమోగినది. గారిడిని ఏర్పాటు చేసి నారు. ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి ఊడిపడేటట్లుగా ప్రస్తుత యువతకు సంస్కృతిని తెలుసుకునేలా ఏర్పాటు చేసినారు. దేవాలయము పూలతో రంగ రంగ వైభవంగా వైకుంఠధామంగా తీర్చిదిద్దినారు. వేద పండితులు వేద పఠనం చేసినారు. అనేకమంది భక్తులు ఈ కార్యక్రమం చూసి ఆనంద పరవశ్యము పొందినారు. ఈ కార్యక్రమం కు అన్ని ఏర్పాట్లు దేవాలయ చైర్మన్ నాగబాబు, పాలకవర్గ సభ్యులు, ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, ఇతర అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.