జనసేన పార్టీ భీమిలి కార్యాలయంలో అంబరాన్ని తాగిన సంక్రాంతి సంబరాలు
భీమిలి: వి న్యూస్ : జనవరి 14:
భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఎండాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మన ఊరు మన ఆటలో భాగంగా వార్డ్ అధ్యక్షులు శాఖరి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.సందీప్ పంచాకర్ల విచ్చేశారు.ముందుగా భోగి పండుగను పురస్కరించుకుని జనసైనికులకు సందీప్ శుభాకాంక్షలు తెలుపుతూ భోగిమంటలతో సంబరాలు ప్రారంభించారు.వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు కానీ హామీలు ఏవైతే ఐదు సంవత్సరాలుగా ప్రజలకు నమ్మించి చేస్తానని హామీలు ఏవైతే హామీలు చెయ్యలేదో వాటన్నిటిని భోగి మంటల సాక్షిగా మంటల్లో వేయడం జరిగింది. అలాగే ఈ భోగిమంటల సాక్షిగా రాక్షస పాలన కూడా అంతమైపోయి రేపు రాబోయే సార్వత్రిక 2024 ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమిలో ప్రజా ప్రభుత్వం స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు రావాలని అలాగే మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం, జనసేన టిడిపి ప్రభుత్వాన్ని ప్రజలు బలంగా తీసుకొస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ భోగి మంటలలో దహించిపోయే జగన్మోహన్ రెడ్డి హామీలు లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా దహించుకు పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలియజేశారు..