మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

ముంగిళ్ళలో శాంతి సుమాల పరిమళంతో రంగవల్లుల హారం మకర సంక్రాంతికి స్వాగతం పలుకుగా

సంక్రాంతి లక్ష్మి ముంగిట్లోకి వచ్చింది..!

కోడి కూతకు ముందే లేచి ముద్ద మనోహర ముద్దుగుమ్మలు గొబ్బెమ్మలతో మకర సంక్రాంతికి స్వాగతం పలుకగా సంక్రాంతి లక్ష్మి ముంగిట్లోకి వచ్చింది..!

తూర్పు తెరపై బాలభానుడు అరుదెంచక ముందే డూ డూ బసవన్నల ఆటలతో, హరిదాసు కీర్తనలతో మకర సంక్రాంతికి స్వాగతం పలుకుగా సంక్రాంతి లక్ష్మి ముంగిట్లోకి వచ్చింది..!

అంబరాన రంగురంగుల గాలిపటాల అలలతో, పిండి వంటల సువాసనలతో ముక్కారు పంట సిరులు నటింట చేరగా అన్నదాతల చిరునవ్వుతో మకర సంక్రాంతికి స్వాగతం పలకగా సంక్రాంతి లక్ష్మి ముంగిట్లోకి వచ్చింది..!

భోగిమంటలతో నిసిరాత్రి చీకట్లను పారద్రోలుతూ మకర సంక్రాంతికి స్వాగతం పలుకుగా సంక్రాంతి లక్ష్మి ముంగిట్లోకి వచ్చింది..!

కోడిపందాల ఎడ్ల పందాల గెలుపు ఈలలతో మకర సంక్రాంతికి స్వాగతం పలుకగా పలుకుగా సంక్రాంతి లక్ష్మి ముంగిట్లోకి వచ్చింది..!

మన సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయం కలకాలం నిలవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.