పలు దేవాలయాలను సందర్శించిన ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంద్ర జిల్లాల ఓబీసీ ఇంచార్జ్ పల్లి శ్రీనివాసులు

పలు దేవాలయాలను సందర్శించిన ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంద్ర జిల్లాల ఓబీసీ ఇంచార్జ్ పల్లి శ్రీనివాసులు.

విశాఖ : పెన్ షాట్ ప్రతినిధి : జనవరి 22:

అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా సోమవారం విశాఖ సౌత్ లో శ్రీరాముని శోభా ఉత్సవాలు ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంద్ర జిల్లాల ఓబీసీ ఇంచార్జ్ పల్లి శ్రీనివాసులు నాయుడుఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు దేవాలయాలలో నిర్వహించే పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 500 ఏళ్ళ నాటి భారతీయుల సనాతన ధర్మం కల సోమవారం నెరవేరిందని సాక్షాత్తు మళ్లీ అయోధ్యలో జన్మించినట్టు ఉందని అన్నారు. అయోధ్య బాలరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ 11 ఉపావాస దీక్ష చేసి నేలపై నిద్రించి ప్రాణ ప్రతిష్ట ఆయన చేశారని ఆయన భారతీయ హిందువులు ఆయనకు రుణపడి ఉంటారని ఆయన అన్నారు.