నరసాపురంలో అవినీతి పాలనకు భోగితో విముక్తి కలగాలి - నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు.
నరసాపురం :వి న్యూస్: 14:
నరసాపురం లో మోసగాళ్ల పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. నరసాపురం ఎమ్మెల్యే ప్రచురించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన పత్రాలను ఆదివారం భోగి పండుగ సందర్బంగా భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.ముందుగా తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలని అన్నారు. వచ్చే భోగి నాటికి ప్రజల సుభిక్షమైన పాలన కొనసాగుతాదని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు భోగి మంటల్లో ద్వారా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎమ్మెల్యే కు తను ఎంత దాచుకోవాలన్నా యావ తప్ప నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు ఏమైనా చెయ్యాలన్న కలలో కూడా రాదని అన్నారు. మన ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి కి కన్న భూమి మీద ప్రేమ వుంటుంది కానీ నాన్ లోకల్ నాయకులకు అధివృద్ది చెయ్యాలన్నా ఆలోచనే ఉండదని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయల పనులు అంటూ ఇంటింటికీ పంచిపెట్టే పేపర్లు కు మాత్రమే నరసాపురం అభివృద్ధి పరిమీతమైపోయిందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు.