ఆనందపురం రైతులతో పండుగ జరుపుకున్న భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతు నాగమణి.
ఆనందపురం: వి న్యూస్ : జనవరి 14:
పండగ అంటే పంట చేతికి వచ్చి రైతు కుటుంబంతో సంతోషంగా గడిపే రోజు కళకళలాడే ముంగిట రంగవల్లులు బసవన్నలాటపాటలు హరిదాసుల కీర్తనలు చిన్నపిల్లల పతంగులు పిండివంటలు పండక్కి ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు ఇటువంటి సంతోషాల మధ్య ఈరోజు మిమ్మల్ని అందరిని కలిసి మీతో పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పండక్కు వెళ్లొచ్చే ప్రయాణకులు గాని వాహనాల నడిపేవారు గానీ జర భద్రత వహించి మీ గమ్యాన్ని చేరుకోండి ఏటువంటి ప్రమాదాలకు గురికావద్దు చిన్నపిల్లలు కూడా పతంగులతో ఇంటిపై డాబా ఎక్కి విద్యుత్ వైర్లను తాకి విద్యుత్ షాక్ కు గురికాకుండా జాగ్రత్త వహించండి మరీ ముఖ్యంగా పండగ అంటేనే మద్యం మద్యం సేవించి ఎవరు ఆనారోగ్యానికి గురికాకండి మీ ఇంటి ఆడబిడ్డగా నా మనవి మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరికీ ఆదివారం భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో ప్రజా పరిచయ కార్యక్రమంలో భాగంగా తర్లువాడ , మెట్టమీద పాలవలస, దుక్కవానిపాలెం , చాకలిపేట పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని మహిళకు పండగ కానుకగా చీరలు పంపిణీ చేసి అనంతరం దుక్క అచ్చయమ్మ పేరంటాల గుడిని దర్శించుకుంటూ అమ్మవారి ఆశీస్సుల తీసుకున్నాను అని స్వతంత్ర అభ్యర్థి నాగొతు నాగమణి పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో తమతోటి సహచరులు కార్యకర్తలు, కుటుంబీకులు పాల్గొన్నారు.