భోగి మంటల్లో ఆర్థిక పరమైన జి.వోలు దహానం

భోగి మంటల్లో ఆర్థిక పరమైన జి.వోలు దహానం

కూనవరం: జనవరి 15: వి న్యూస్ :


అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని పెదార్కూరు గ్రామంలో యు.టి.ఎఫ్.కూనవరం మండలం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్థిక పరమైన జి.వో.కాఫీల ప్రతులు దహాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఏ.సబ్.కమీటి కన్వీనర్ మరియు జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు యం.వెంకటనారాయణ గారు మాట్లాడుతూ ప్రభుత్వం గృహ నిర్భాందాలతో ఉద్యమాలను అణిచి వేయాలని చూడటం హేయమైన చర్య అని అలాగే మాకు రావాల్సిన ఏపి.జి.ఎల్.ఐ.క్లయిమ్.లు రూ.330 కోట్లు



చెల్లించాలని,12వ పి.ఆర్.సి.విధి విధానాలు వెంటనే రూపొందించాలని, సరెండర్ లీవుల బకాయిలు రూ.4500/ కోట్లు చెల్లించాలని,30 శాతం ఇంటీరియమ్ ఫండ్ వెంటనే చెల్లించాలని పి.ఆర్.సి.డి.ఏ.అరియర్లు రూ.7382 కోట్లు చెల్లించాలని, పి.ఎఫ్.లు సరే మిగిలిన ఆర్థిక పరమైన బకాయిలు మాటేమిటి అని ప్రశ్నించారు.ఈ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఈ రోజు జి.వో.కాఫీల ప్రతులు దహాన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో యు.టి.ఎఫ్.కూనవరం మండల అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు,కన్నారావు,మండల కోశాధికారి యం.రాంబాబు,కుమారి,లలిత,మహాతి పాల్గొన్నారు.