ముగిసిన బొట్టవానిపాలెం ప్రీమీయర్ లీగ్ క్రికెట్ పోటీలు
విజేత గా నిలిచిన బివిపి హంటర్స్ జట్టు
విజేతలకు ట్రోఫీలు అందించిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు
మధురవాడ: (జనవరి 18) :వి న్యూస్:
మధురవాడ: బొట్టవానిపాలెం శివారు లో బీవీపీ యువత ఆధ్వర్యం లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీ కీ.శే కొర్రాయి గోవిందరావు మెమోరియల్ బొట్టవానిపాలెం(బీవీపీ) ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. హోరాహోరీ గా తలపడిన 5 జట్లులలో రెండు జట్లు ఫైనాల్ కు చేరుకోగా విజేత గా బీవీపీ హంటర్స్,రన్నర్ గ బీవీపీ గేమ్ చేంజర్ లు నిలిచాయి. గెలుపొందిన జట్లకు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మరియు గ్రామ పెద్దలు కలిసి ట్రోఫీలను,నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమం లో మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతీ సంక్రాంతి కి యువత చెడు మార్గాలకు వెళ్లకుండా ఈ క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే యువతను ఉద్దేశించి ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రులను గౌరవించాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థానం లో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో టిడిపి భీమిలీ నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, ఈగల రవి కుమార్, నమ్మి సూర్య అప్పారావు, కొర్రాయి మంగరాజు,ముగడ రమణ, మేడబోయిన సూర్య, బొట్ట అప్పారావు ,దాసరి గోవింద్, కొర్రాయి సురేష్,ఇమంది అప్పలరాజు, దాసరి నాయుడు, లంక వెంకటేష్,నమ్మి పేద రమణ, కోరాయి అప్పల స్వామి, గౌతమి వెంకటి, బొట్ట సురేష్,బొట్ట అప్పలరాజు, బొట్ట కనకరాజు,నమ్మి చిన రమణ, మేడబోయిన కళ్యాణ్, వానపిల్లి శ్రీను, అభి శ్రీను మరియు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు.