మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగ క్షమాపణ చెప్పాలి: భీమిలి నియోజకవర్గం ఎస్సీ సెల్ ఇంచార్జ్ కనకరాజు సియ్యాద్రి
బక్కన్నపాలెం: వి న్యూస్ : జనవరి 21:
అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం కూల్చి వేస్తాం అనే విషయంపై మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ళ నరేంద్రకు వ్యతిరేకంగా మధురవాడ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన.ఆరోవార్డు బక్కన్నపాలెం గ్రామంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం కూల్చి వేస్తాం అనే విషయంపై మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ళ నరేంద్రకు వ్యతిరేకంగా మధురవాడ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భీమిలి నియోజకవర్గం ఎస్సీ సెల్ ఇంచార్జ్ కనకరాజు సియ్యాద్రి మాట్లాడుతూ
ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు.సుమారు 400 కోట్లు వ్యయం వ్యయం 125 అడుగులు ఎత్తుగల విగ్రహం దేశంలొనే గర్వించ దగ్గ విషయం. ఈ ప్రాజెక్టులో ఏమైనా అవకతవకలు ఉంటే ఆధారాలతో నిరూపించండి.లేనిపోని ఆరోపణలు చేస్తాం విగ్రహాలను కూలుస్తాం అంటే చూస్తూ ఊరుకోం.మా పోరాటాన్ని ఉదృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం అని అన్నారు.