చిప్పాడ కల్లాల వద్ద కోడి పందాలు ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.
భీమిలి: వి న్యూస్ : జనవరి 14:
భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో హరీష్ ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి చిప్పాడ కల్లాల వద్ద కోడి పందాలు ఆట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి పదహారువందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు భీమిలి పోలీసులు తెలిపారు. అదేవిధంగా పండుగలో ఎటువంటి జూదం ఆటలు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.