గోకుల్ అపార్ట్మెంట్స్ శ్రీరాధాకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభా ఉత్సవాలు.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి :
జనవరి 22 మధురవాడ ఆర్ టీ సి కాలనీ గోకుల్ విహార్ అపార్ట్మెంట్స్ శ్రీరాధా కృష్ణా ఆలయం కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా సోమవారం సాయంత్రం సంస్కృతిక కార్యక్రమాలు కోలాటం నృత్యం,శ్రీరాముని భజనలు, గీతాలపన కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ఘనంగా నిర్వహించారు. వాటిలో భాగంగా మధురవాడ శ్రీ లక్ష్మి నరసింహ కోలాటం బృందం అధ్యక్షులు సిరిపురపు సంతోషి, వాండ్రాసి మంగ, గరే సన్నియమ్మ ఆధ్వర్యంలో చిన్నారులు కోలాటం నృత్యం ప్రదర్శన చేసారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మధురవాడ ప్రకండ సెక్రటరీ, ఎస్ వి రమణ, బీజేపీ ఓ బి సి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతిన పైడిరాజు, బీజేపీ భీమిలి నియోజకవర్గం కో కన్వినర్ పసుపులేటి శ్రీనివాస్ రావు, గోకుల్ అపార్ట్మెంట్స్ కమిటీ సెక్రటరీ బాధిరెడ్డి రవి శంకర్, బిల్డర్ రమేష్, నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.