శ్రీ సిద్దేశ్వర పీఠం లో గోదా రంగనాథుల కల్యాణం
మధురవాడ వి న్యూస్ :2024 జనవరి 17:
భీమిలి నియోజకవర్గ పరిధిలోని 6వ వార్డ్ మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం ప్రక్కన ఉన్న శ్రీ సిద్దేశ్వర
పీఠం లో సోమవారం భోగిరోజు గోదా రంగనాథుల కల్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు అర్చకులు శ్రీనివాస్ శర్మ నిర్వహించారు.. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ సాధారణంగా సీతా రామ కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకొంటూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో (గోదా కళ్యాణం) మాత్రం వైభవం అంతా అమ్మ గోదా దేవికే. ఎందుకో తెలుసా???
మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే “పాడియరుళవల్ల పల్-వళై యాయ్" అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం.అని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన వీర మహిళ పోతిన. అనురాధ ఆధ్వర్యంలో మధురవాడ కు చెందిన శ్రీ లక్మి నరసింహ కోలాటం బృందం వారు మరియు సితమ్మధార నుంచి వచ్చిన సాయి కోలాటం వారు, కోలాటం చేసి భక్తులను ఆకర్షించరూ.ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..