జనసైనికులు ఆధ్వర్యంలో వాంబే కాలనీలో సంక్రాంతి సంబరాలు
ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
భీమిలి: వి న్యూస్ : జనవరి 13:
భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసీ జోన్-2, 7వ వార్డ్ జనసేన అధ్యక్షుడు నాగోతి. నరసింహ నాయుడు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాంబే కాలనీ లో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచాకర్ల విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు.ఈ పోటీల్లో సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో వివిధ ,,వార్డుల అధ్యక్షులు, కూడా పాల్గొన్నారు.సందీప్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో భీమిలి నియోజకవర్గంలో మన ఊరు మన ఆట అనే కార్యక్రమం లో భాగంగా సంక్రాంతి సంబరాలు జరపడం జరిగింది.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సంక్రాంతి అంటేనే మహిళలకు ప్రత్యేకమైనది గొబ్బెమ్మలు ముగ్గులు పోటీలు పిండి వంటకాలు ఇటువంటి కార్యక్రమాల వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి ద్వారా బాలబాలికలకు తెలిసి వస్తుంది .ఈ ముగ్గుల పోటీల్లో జనసేన గుర్తు ప్రతిబించేలా గాజు గ్లాసు ముగ్గులు, రైతులను గౌరవించే విధంగా వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.
రానున్న జనసేన టిడిపి మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసే విధంగా రూపొందిస్తాం. వార్డ్ అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ గతంలో ఈ సంస్కృతి పల్లెటూర్లోనే పరిమితమయ్యేది ఇప్పుడు నగరాలకు కూడా ఈ సంస్కృతి అలవాటు అవ్వడం చాలా ఆనందంగా ఉందని మన సంస్కృతి ఇంకా అభివృద్ధి చెందాలని తెలియజేస్తున్నారు .రాబోయే తరానికి కూడా మన సంస్కృతికి గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నేర్పాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పోతిన. తిరుమల రావు,పిళ్ళా. శ్రీను, జి. కామేశ్వర రావు, స్వాతి శ్రీను, పి.త్రినాద్, వి.చిన్న,వి.శ్రీను, రెడ్డి రాజు, డి.జె రాము, కొల్లి. శంకర్, పి.గంగ రాజు,ఈ. వెంకటేష్, మరియు వాంబే కాలనీ యువత తదితరులు జనసైనికులు పాల్గొన్నారు....