జీ. ఓ. ప్రతులను తగలబెట్టిన అంగన్వాడీలు..
కూనవరం :జనవరి 14: వి న్యూస్ :
మండలంలోని అంగన్వాడీల సమ్మె యధావిధిగా కొనసాగింది.ఈ సమ్మె శిబిరంలో భోగి పండుగ నిర్వహించి భోగి మంటలలో జీ.వో. నెంబర్ రెండు కాగితాలను అంగనవాడీలు స్థానిక ప్రజల సమక్షంలో దగ్ధం చేసారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అన్నపూర్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్,డీజిల్ అన్ని రకాల గృహాపకరమైన వస్తువులపై విపరీతమైన రేట్లు పెంచిందని అన్నారు.ప్రస్తుతం ఏది కొని తినే పరిస్థితి లేదని అన్నారు.అంగన్వాడీలు అప్పట్లో పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి చాలీచాలని జీతాల గురించి అర్ధాకలి బతుకుల గురించి విన్నవించడం జరిగిందని అన్నారు. అప్పుడు మాట ఇచ్చారని వారికి ఇచ్చిన మాట నేటికీ అమలు పరచక పోగా అంగన్వాడీలను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు.ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రానున్న కాలంలో అంగన్వాడీ ల పోరాటాన్ని తీవ్ర స్థాయిలో పోరాటం ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కొమరం పెంటయ్య,తాళ్లూరి శ్రీనివాసరావు, గిరిజన సంఘం నాయకుడు పాయం సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు