ఆదివాసి గిరిజన నిండు గర్భని 8 కిలోమీటర్లు డోలు మోతతో ఆస్పత్రికి తరలింపు

ఆదివాసి గిరిజన నిండు గర్భని 8 కిలోమీటర్లు డోలు మోతతో ఆస్పత్రికి తరలింపు

అనంతగిరి: వి న్యూస్ : జనవరి 21:

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పి నకోట పంచాయతీ రాచకి లం కొండ శిఖర గ్రామం. సుకూరు చిన్నాలమ్మ (33) మూడవ గర్భిణీ ఉదయం 11 గంటలకి నొప్పులు రావడంతో తన బంధువులు సహాయంతో బల్లగరువు రోడ్డు మార్గం వద్దకు డోలుమోసుకొని తీసుకొచ్చారు.

 అక్కడనుండి పినకోట PHC కి అంబులెన్స్ ద్వారా తరలించడం జరిగింది.

ఈ వారంలో ముగ్గురిని ఇదే పరిస్థితిగా డోలుమోసుకొని తీసుకొస్తున్నారు.

 పెద్దకోట. పినకోట. జీణపాడు. పంచాయతీ పరిధిలో. 11 ఆదివాసి గిరిజన  P.V.T.G తెగలకు చెందిన 2000 మంది కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. వీరికి బల్లగో రు నుండి దాయుర్తి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక కోటి 20 లక్షల రూపాయలు 7 కిలోమీటర్లు రోడ్లకు నిధులు మంజూరు చేసి ( మిషన్ కనెక్ట్ పాడేరు ) పేరుమీద నిధులు మంజూరు చేశారు 2022 సంవత్సరంలో. రోడ్డు పనులు మధ్యలోనే నిలుపుదల చేశారు. ఈ రోడ్డు పూర్తి చేస్తే. డోలీలు మూడు కిలోమీటర్ల వరకే తీసుకొచ్చి అక్కడ నుంచి 108 వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల. నిరంతరం 11 గ్రామాల గిరిజనులు  వారంలో ముగ్గురు చొప్పున ఎత్తయిన కొండల మధ్య. బంధువుల ద్వారా డోలి మూసుకొని. బల్లగరు గ్రామ వరకు. అడవి తల్లి  మార్గంలో అరచేతులు ప్రాణాలు పెట్టుకుని. డోలుమోసుకొని వచ్చే పరిస్థితి.

 ఇటువంటి పరిస్థితుల్లో రాచ కీయం గిరిజనులు 2022 సంవత్సరంలో సొంతంగా నెలరోజుల పాటు బైక్లు తిరిగేందుకు రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అనంతగిరి ఎంపీడీవో  రాచ కీయం గ్రామాన్ని సందర్శించి  20 లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజనులే పనులు చేసేందుకునిధులు మంజూరు. చేశారు. గుమ్మ తిన నుండి రాచ కీయం నుండి రెడ్డి పాడు వరకు. నిధులు మంజూరు చేస్తే. మధ్యలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో. గిరిజనులు చేసిన ఉపాధి పనులు డబ్బులు కూడా మధ్యలో నిలుపుదల చేశారు. ఎవరో చెప్పుకోవాలో దిక్కు లేక. జగనన్నకు చెప్పుకుందాం. అనంతగిరి మండల కేంద్రంలో స్వయాన ఐటిడిఏ పిఓ జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తే. ఫిర్యాదు చేసిన నేటికీ సమస్య పరిష్కారం చేయలేదు. ఈనెల 26వ తారీఖున మడ్రేవు నుండి దాయిర్తి వరకు. గుర్రాలతో డోలి యాత్ర నిర్వహిస్తామని.. ఎలక్షన్ ముందే రోడ్డు పనులు ప్రారంభించక పోతే. ఓట్లు  కొరకు  రాజకీయ నాయకులను రానివ్వమని ఈ సందర్భంగా అధికారులకు రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలోసూకూరు జన్మరాజు. సిపిఎం నాయకులు కే గోవిందరావు. తక్షణమే జిల్లా కలెక్టర్  డోలీలు గ్రామాన్ని సందర్శించి. రోడ్డు పనులు మొదలు పెట్టాలని. డిమాండ్ చేయడం జరిగింది