బొడ్డపాలెం జగనన్న కాలనీలో 7ఏళ్ళ బాలుడు మాన్ హోల్లో పడి మృతి

బొడ్డపాలెం జగనన్న కాలనీలో 7ఏళ్ళ బాలుడు మాన్ హోల్లో పడి మృతి 

ఆనందపురం: వి న్యూస్ : జనవరి 19:



విశాఖ :ఆనందపురం మండలం బోడ్డపాలెం జగనన్న కోలనిలో వాంబేకాలనీ 46ఏ /ఎఫ్ ఎఫ్ 8 కి చెందిన 7ఏళ్ళ బాలుడు భీమిలిలో మాన్ హోల్లో పడి మృతి చెందాడు. ఆనందపురం బొడ్డపాలెం గ్రామానికి పండుగ కొరకు చుట్టాలింటికి వెళ్లిన చిప్పాడ కౌశిక్ వయసు 7 బొమ్మ గన్ మాన్ హోల్ లో పడిపోవటంతో అది తీసుకునేందుకు ప్రయత్నించిన బాలుడు ఆ మాన్ హోల్లో పడి మృతి చెందాడు. అది తెలిసిన తల్లి పార్వతి స్పృహ తప్పి పడిపోయి భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని సమాచారం.మృత దేహాన్ని భీమిలి‌ మార్చురీ తరలించిన పోలీసులు.