ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆదర్శవంతుడు, చిరస్మరనీయుడు ఎన్టీఆర్. 7వ వార్డ్ కార్పోరేటర్ పిళ్ళా. మంగమ్మ
మధురవాడ : (జనవరి 18) :వి న్యూస్:
భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వ వార్డ్ తెదేపా నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 7వ వార్డ్ కార్పోరేటర్ పిళ్ళా. మంగమ్మ వెంకటరావు దంపతులు విచ్చేశారు.
ఈ సందర్భంగా మధురవాడ మార్కెట్ రోడ్డు ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో మరియు చంద్రంపాలెం లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ స్వర్గీయులు నందమూరి తారక రామారావు అంటే ప్రతి తెలుగోడి హృదయాల్లో చిరస్మయుడుగా మిగిలిపోయిన వ్యక్తి .ఎన్టీఆర్ కారణజన్ముడు, యుగపురుషుడని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం రెండు రూపాయల పధకం తీసుకువచ్చారు. పేదలకు పక్కా ఇల్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్‌దని, సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారక రాముడని వ్యాఖ్యానించారు.