తెలుగువారి ఆత్మగౌరవం ఎన్.టి.ఆర్.! జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత.
మధురవాడ: (జనవరి 18) :వి న్యూస్:
తెలుగు వారి ఆత్మగౌరవం నలుదిక్కులా చాటిచెప్పిన అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీనందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా 5వ వార్డు పరిధి పరదేశిపాలెం జాతీయ రహదారి చేరువలోఎన్.టి.ఆర్. నిలువెత్తు విగ్రహానికి 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టిడిపి రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు, విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు,వార్డ్ టిడిపి అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ(జపాన్), ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ.. తెలుగుజాతి ఉన్నతిని చాటిచెప్పిన మహానాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు.కేవలం పార్టీ స్థాపించిన 9నెలలోనే అధికారంలోకి వచ్చింది అంటే అది ఎన్టీఆర్ దిక్సూచి అని,ఆయన ఆశయాలే మాకు స్ఫూర్తి అని అన్నారు.ఎన్టీఆర్ చేసిన సేవా కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలు గురించి ఈసందర్భంగా గుర్తు చేశారు. మొల్లిలక్ష్మణరావు, వాండ్రాశి అప్పలరాజు మాట్లాడుతూ..ప్రపంచదేశాలో ప్రముఖ కళాకారుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగువారి ఉనికిని దశ,దిశ,లకు చాటిచెప్పిన మహోన్నతవ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.ఆయన ఆశయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకురా వడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,టిడిపి ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఉపాధ్యక్షులు ఈయ్యపు నాయుడు,కంబపు కామరాజు, యువత అధ్యక్షులు కొండపు రాజు, సీనియర్ నాయకులు బోర అప్పల సూరిబాబు రెడ్డి , చలుమోలు శ్రీనివాసరావు ( గడ్డి శ్రీను),దాలేం దొర, బొడ్డేపల్లి రంగారావు, కురుమోజు గోవిందరావు, జోగేశ్వరపాత్రో,కొత్తల శ్రీనివాసరావు,బొర సూర్యచంద్ర,బోరాఎర్రయ్యా రెడ్డి,మోహన్,నల్లానా ఆనందరావు,అప్పన్న,చక్రి, శేఖర్,అవ్వ కృష్ణ,పిల్ల వెంకటరావు,కొవ్వాడ షణ్ముఖ, ఈగల అప్పలనాయుడు, ఇల్లిపిల్లి అప్పారావు, వైకుంఠరావు, కోర్రాయి మంగరాజు, బోట్ట సురేష్, ఓమ్మి సూరి,బొట్ట అప్పలరాజు, లక్ష్మణరావు ,ఓలేటి శ్రావణ్, వంక నూకరాజు,షేక్ మదీనా,పసుపులేటి మోహన్ రావు,విష్ణు, వెంకట సత్యనారాయణ,జ్ఞానేశ్వర్ రావ్,ఇమంది రాజు,మహిళ నాయకురాలు సరస్వతి, వియ్యపు సునీత, సొండి వనిత,అన్నపూర్ణ,రాజమ్మ ,సీతమ్మ, వరలక్ష్మి,ప్రసన్నకుమారి, అప్పన్న,అప్పలరాజు,కృష్ణ , శ్యామ్ ,రాధకృష్ణ, మరుపిల్ల చిన్న, కురుమోజు శ్రీనివాసరావు,గౌరీ శంకర్, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ శ్రీకాంత్,భారి సంఖ్యలో టీడీపీ,జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.